క్రేజీ కల్యాణం సినిమా నుంచి మాస్ సాంగ్ విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ 'క్రేజీ కల్యాణం'. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ తెలంగాణ మాండలిక పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, జంగిరెడ్డి ఆలపించారు.