బెంగళూరులో దారుణం: అప్పు కోసం మహిళపై అమానుష దాడి

రిపోర్టర్: గోపి స్థలం: Bengaluru

బెంగళూరులో అప్పు తీర్చలేదనే నెపంతో ఓ మహిళను, ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసి బంధించారు. నిందితులు ఆమెపై దాడి చేయడమే కాకుండా, బట్టలు విప్పించి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు. వ్యభిచారం చేయాలని వేధించారు. బాధితురాలి ఫిర్యాదుతో చంద్ర లేఅవుట్ పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.