విజయవాడ మేయర్ పీఠం ముస్లిం మైనారిటీలకు కేటాయించాలి జలీల్ ఖాన్ డిమాండ్

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

విజయవాడ మేయర్ పీఠాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పార్టీకి నమ్మకంగా ఉంటున్న ముస్లిం వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఒకవేళ రిజర్వేషన్ల ప్రకారం మేయర్ స్థానం మహిళలకు కేటాయించాల్సి వస్తే, తన కుమార్తెకు ఆ అవకాశం ఇవ్వాలని జలీల్ ఖాన్ బహిరంగంగా విజ్ఞప్తి చేయడం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.