పోలకమ్మ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పర్వతగిరి
పర్వతగిరి మండల పరిధిలోని పోలకమ్మ చెరువు వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ బుధవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యుత్ దీపాలు, తాగునీరు, పారిశుధ్యం, బారికేడింగ్ మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు.