నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉండటంతో ఇసుకాసురులు పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. కలెక్టర్ నిషేధాజ్ఞలు జారీ చేసినా, కలువాయి మండలం రాజుపాలెం సహా పలు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.