ఓటర్ల జాబితా ప్రక్షాళనపై విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: భాజపా దిలీప్

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ఓటర్ల జాబితాల పునఃసమీక్షపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని భాజపా రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి కిలారు దిలీప్ పిలుపునిచ్చారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల సంఘానికి ఈ అధికారం ఉందని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం తొలిసారిగా దీనిని ప్రవేశపెట్టినట్లు చిత్రీకరించడం సరికాదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు మానుకోవాలని రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ హితవు పలికారు.