స్టార్టప్ ఉద్యోగం నుంచి తొలగింపుపై యువ డెవలపర్ ఆవేదన
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
స్టార్టప్‌లో తొమ్మిది నెలలు పనిచేసిన తర్వాత ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా రాజీనామా చేయాలని యాజమాన్యం కోరిందని ఓ యువ వెబ్ డెవలపర్ రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. తన పనితీరుపై ముందుగా ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా ర్గా తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తోటి ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదురయ్యాయని, ఇది తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆయన వాపోయారు. ఈ ఘటన నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.