తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. రేపు సాయంత్రం అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 15న ధ్వజారోహణంతో వాహనసేవలు మొదలవుతాయి. భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 6300 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మాడ వీధులు, విద్యుత్ దీపాలంకరణలతో తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా తయారైంది.