డల్లాపల్లి ఎకో టూరిజం ప్రాజెక్టుకు అంకురార్పణ: పర్యాటకులకు సరికొత్త అనుభూతి
రిపోర్టర్: రాము
స్థలం: Alluri Sitharama Raju
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డల్లాపల్లిలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఎకో టూరిజం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు సంయుక్త కలెక్టర్ శ్రీపూజ వెల్లడించారు. సుమారు ఐదు కోట్ల రూపాయలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా పార్కులు, అతిథిగృహాలు నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. సముద్రమట్టానికి మూడు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో మంచు అందాలు, సూర్యోదయ దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.