జన్నారంలో పేదలకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు నూతన డిజిటల్ రేషన్ కార్డులను ఘనంగా పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేస్తూ ప్రజలకు భరోసానిచ్చారు.