అమరావతి నివాస భూముల సేకరణపై ప్రభుత్వంపై అమరావతి పరిరక్షణ సమితి ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: Amaravati

అమరావతి రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల నివాస ప్రాంతాలను వ్యవసాయ భూములుగా పరిగణించి భూసేకరణ చేపట్టడం సరికాదని అమరావతి పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా రైతుల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ఈ నిర్ణయం రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని, సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.