యాదాద్రి పూజారి హత్య కేసులో మధ్యప్రదేశ్ పారిపోతున్న నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: హరి
స్థలం: నిర్మల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జోగిని సుధాకర్ స్వామిని హత్య చేసి, బంగారు ఆభరణాలు, కారుతో మధ్యప్రదేశ్ కు పారిపోతున్న నిందితుడిని నిర్మల్ జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సోన్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడి వద్ద నుండి సుమారు 1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, తొమ్మిది లక్షల రూపాయల నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.