యూట్యూబర్ భర్త హరిబాబు హత్య కేసు నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17న నిజామాబాద్‌లోని ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద హరిబాబును హత్య చేసినట్లు నిందితుడు సంతోష్ వెల్లడించాడు. వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.