తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెదర్ అంచనా

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh / Telangana

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని స్కైమెట్ వెదర్ సంస్థ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.