ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్లో ఆదివారం శ్రీలంకతో తలపడేందుకు భారత జట్టు పూర్తి విశ్వాసంతో సిద్ధమైంది. టోర్నీలో అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచామని, ఎలాంటి మార్పులు లేకుండా తమ బలాలపైనే దృష్టి పెడతామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పష్టం చేశారు. దుబాయ్ వేదికగా జరిగే ఈ టైటిల్ పోరులో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.