విజయవాడ రైల్వేస్టేషన్ లో చారిత్రక నీటి టవర్ల విశేషాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

విజయవాడ రైల్వే జంక్షన్‌లో 1888లో బొగ్గు రైళ్ల ఇంజిన్లకు నీళ్లు పోసేందుకు నిర్మించిన చారిత్రక నీటి టవర్లు నేటికీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. బ్రిటిష్ కాలంలో కృష్ణానది నీటిని ఈ టవర్లలోకి తోడి ఇంజిన్లతో పాటు అధికారుల బంగ్లాలకు సరఫరా చేసేవారు. కాలక్రమేణా డీజిల్, ఎలక్ట్రికల్ ఇంజిన్లు వచ్చినా, ఇప్పటికీ ఈ టవర్ల ద్వారానే రైల్వేస్టేషన్, కాలనీలకు నీటి సరఫరా కొనసాగుతుండటం విశేషం.