'ఎవరేమనుకున్నా ఎంపీ అభ్యర్థి మీరే': తమ్మినేని సీతారాంతో వైఎస్ జగన్ భేటీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా వైకాపా రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ తాడేపల్లిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జిల్లాలో ధర్మాన సోదరుల తీరు, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే అంశాలపై జగన్‌కు తమ్మినేని వివరణ ఇచ్చారు. ఈ భేటీలో ఎవరేమనుకున్నా ఎంపీ అభ్యర్థి మీరేనని తమ్మినేని సీతారాంకు జగన్ భరోసానిచ్చారు. డీలిమిటేషన్ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.