వైద్య రంగంలో సంచలనం: సికింద్రాబాద్ KIMS ఆసుపత్రిలో టల్సా ప్రో చికిత్స
రిపోర్టర్: సురేష్
స్థలం: సికింద్రాబాద్
దేశ వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైందని, సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక టల్సా ప్రో సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని DSS ఇమేజ్టెక్ బిజినెస్ హెడ్ అనీష్ కౌశల్ తెలిపారు. ఎలాంటి కోతలు లేకుండా MRI ఆధారంగా క్యాన్సర్ కణజాలాన్ని నాశనం చేసే ఈ నూతన విధానం దక్షిణాసియాలోనే తొలిసారిగా కిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి రావడం రోగులకు పెద్ద ఊరట అని నిపుణులు వెల్లడించారు.