టీటీడీ నూతన చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ: రేసులో శ్రీనివాస రామానుజం
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి చైర్మన్ ఎంపికపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపై చర్చ సాగుతోంది. ఈ రేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాస రామానుజంతో పాటు కిమిడి కళా వెంకటరావు, జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.