'వైద్యవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి': ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయవాడ

కాలానికి అనుగుణంగా వైద్యవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతోపాటు పరిశోధనలకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ స్పష్టంచేశారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన విద్యా కార్యక్రమాలు, ప్రవేశాలు, పరిశోధనలపై చర్చించారు. వైద్యవిద్యలో కృత్రిమ మేధ, డిజిటల్‌ హెల్త్ వంటి నూతన విభాగాలకు ప్రాధాన్యమిస్తూ ఉమ్మడి పరిశోధనలపై దృష్టిసారించాలని ఈ సమావేశంలో వీసీ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌లకు ఆయన సూచించారు.