మార్కెట్లోకి కొత్త మహీంద్రా థార్ ఓజీ ధర వివరాలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన సరికొత్త 3-డోర్ అప్డేటెడ్ మోడల్ మహీంద్రా థార్ ఓజీని భారత మార్కెట్లో విడుదల చేసింది. హైదరాబాద్‌లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.32 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షల వరకు ఉంది. థార్ రాక్స్ ఆధారిత డిజైన్‌తో కూడిన కొత్త గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లతో ఈ ఎస్‌యూవీని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.