'నిమజ్జన వేడుకలో తీరని విషాదం': సంగారెడ్డి జిల్లాలో ఆరుగురు విద్యార్థులు మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సంగారెడ్డి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విగ్రహ నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నేరేడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో నరసింహ, తేజ, సిద్ధార్థ, గణేశ్, సుమంత్‌రెడ్డి, ఉదయ్‌కిరణ్ మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.