పాలకొండ ఎంపీటీసీ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థుల సుడిగాలి ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ మండలంలో ఎంపీటీసీ కూటమి టీడీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డోలామడ అభ్యర్థి కర్నెన యోగిత, వాటపాగు అభ్యర్థి కర్నెన పద్మిని ప్రియదర్శిని గ్రామాల్లో తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటర్లను కలిసి మద్దతు కోరారు.