టాలీవుడ్ సంచలనం: త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ గాడ్ ఆఫ్ వార్ చిత్రం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ చిత్రం గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన ఒక టాక్ షోలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దైవ సంకల్పంతోనే రూపుదిద్దుకుంటోందని త్రివిక్రమ్ భావోద్వేగంతో పంచుకున్నారు.