అన్నం పరబ్రహ్మ స్వరూపమని చాటిన చైర్మన్ మేక వెంకటేశ్వర్ రెడ్డి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని నమిల ప్రాథమిక పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలంగాణ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య కమిటీ చైర్మన్ మేక వెంకటేశ్వర్ రెడ్డి రుచికరమైన మిల్లెట్స్ భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఆకలి తీర్చే చేతులు దైవ బాటలు అవుతాయన్నారు. విద్యాదానం మహా దానమని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.