సమర్కండ్‌లో భారత చెస్ క్రీడాకారులకు హోటల్ వసతి సమస్య పరిష్కారం
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరుగుతున్న 46వ చెస్ ఒలింపియట్‌లో పాల్గొనేందుకు వెళ్లిన భారత క్రీడాకారులకు ఎదురైన హోటల్ వసతి సమస్య పరిష్కారమైంది. నిర్వాహకుల లోపం వల్ల ఆటగాళ్లు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. AICF అధ్యక్షుడు నితిన్ నారంగ్ జోక్యంతో FIDE అధికారులతో మాట్లాడి ఆటగాళ్లకు వేర్వేరు గదులను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.