బిగ్ బాస్ హౌస్ లో సంచాలకుల మధ్య వివాదం: ఇంటి సభ్యులకు భారీ శిక్ష తప్పదా
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు సీజన్ పదిలో తొమ్మిదో వారం ఆటలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రివార్డ్స్ అండ్ రివేంజ్ టాస్కులో భాగంగా సంచాలకులు త్రిగుణ్, ముకేష్ల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇద్దరూ ఒక నిర్ణయానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బిగ్ బాస్ హెచ్చరించడంతో ఇంటి సభ్యులందరికీ పనిష్మెంట్ పడే అవకాశం ఉందని సమాచారం వస్తోంది.