న్యాయస్థానాల పనితీరుపై రిటైర్డ్ జడ్జి పూనమ్ బాంబా సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: రాము
స్థలం: Delhi
న్యాయమూర్తుల రోజువారీ విధులు కేవలం వాదనలు వినడం, తీర్పులు ఇవ్వడానికే పరిమితం కావని ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి పూనమ్ ఏ బాంబా స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మేజిస్ట్రేట్లు రోజుకు వందకు పైగా కేసులు విచారిస్తారని, వేల సంఖ్యలో పత్రాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. సీబీఐ, టెర్రర్ ఫండింగ్ వంటి తీవ్రమైన కేసుల్ లో గంటల కొద్దీ సాక్ష్యాల నమోదు సాగుతుందని, న్యాయవ్యవస్థ వెనుక అంకితభావంతో పనిచేసే సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని వివరించారు.