ఏపీలో క్రిటికల్ కేర్ బ్లాకులు ప్రారంభించిన నడ్డా, చంద్రబాబు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడలో రాష్ట్రవ్యాప్త క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను కేంద్రమంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఏపీలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నడ్డా స్పష్టం చేశారు.