'ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి': రవిదాస్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నిజామాబాద్
ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ ఆఫీసర్ రవిదాస్ మాట్లాడుతూ ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గంగా కిషన్, డాక్టర్ తిరుపతితో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.