ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్లో కఠినమైన పొదుపు చర్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: World
అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు మరియు తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించింది. సెప్టెంబర్ 17న వెలువడిన కొత్త మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 9 గంటలకు, వెడ్డింగ్ హాల్స్ 10 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. పెళ్లిళ్లలో విందుకు కేవలం ఒక వంటకం మాత్రమే వడ్డించాలని, ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాను 50 శాతం మేర తగ్గించినట్లు అధికారులు తెలిపారు.