పరిషత్‌ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ నెల 15, 16 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అన్ని పరిశీలనల అనంతరం ఈనెల 19న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.