దేబ్జానీ వెన్నుపోటు పొడిచిందంటూ బిగ్ బాస్ ఝాన్సీ కన్నీటి పర్యంతం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

బిగ్ బాస్ తెలుగు షో నుంచి ఇటీవల ఎలిమినేట్ అయిన సింగర్ ఝాన్సీ తోటి కంటెస్టెంట్ దేబ్జానీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేబ్జానీని గుడ్డిగా నమ్మి సొంత అక్కలా భావించానని కానీ ఆమె తనకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. చివరి వారంలో తనకు మద్దతు ఇవ్వవద్దని ఇతర కంటెస్టెంట్లకు దేబ్జానీ చెప్పిందని వెల్లడించారు. తాను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదని ఝాన్సీ ఆవేదనతో పేర్కొన్నారు.