నెల్లూరు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై ప్రజాప్రతినిధుల మౌనంపై ప్రజల ఆవేదన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
రాష్ట్రంలో కీలకమైన నెల్లూరు జిల్లాకు పోలీసు కమిషనరేట్ హోదా దక్కకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల చొరవ కొరవడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సింహపురి వాసులు మండిపడుతున్నారు. నగరంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడానికి, శాంతిభద్రతలను పటిష్టం చేయడానికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నెల్లూరుకు ప్రాధాన్యం లభించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.