ప్యారడైజ్ ప్రీ-రిలీజ్ వేడుకలో రాఘవ్ జుయల్ డ్యాన్స్ అదరగొట్టారు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ ప్రీ-రిలీజ్ వేడుకలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ తన డ్యాన్స్తో స్టేజ్ను షేక్ చేశారు. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఆయన, అనిరుధ్ సంగీతానికి వేదికపై అదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్నారు. యాంకర్ సుమతో కలిసి ఆయన వేసిన అడుగులు ఈవెంట్కే హైలైట్గా నిలిచాయి.