ముంబైలో ఘనంగా టైమ్స్ ఆఫ్ ఇండియా సోషల్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మహారాష్ట్ర

ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా సోషల్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. దేశంలో సామాజికాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, పర్యావరణ రంగాలలో విశేష కృషి చేస్తున్న 18 సంస్థలను ఈ వేదికపై సత్కరించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరై, సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సును సామాజిక మార్పు కోసం ఎలా ఉపయోగించాలనే దానిపై దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చించారు.