క్యాన్సర్‌తో ఆస్ట్రేలియా టీవీ నటి టేలా మీత్ కన్నుమూత

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

ప్రముఖ ఆస్ట్రేలియన్ టీవీ రియాల్టీ షో 'ది డాగ్ హౌస్ ఆస్ట్రేలియా' నటి టేలా మీత్ క్యాన్సర్‌తో పోరాడుతూ 30 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా అనే అరుదైన క్యాన్సర్‌తో సుదీర్ఘకాలంగా పోరాడిన ఆమె, సెప్టెంబర్ 1న తుదిశ్వాస విడిచారు. జంతువులపై ఆమె చూపిన ప్రేమ, సేవలను తోటి నటులు, అభిమానులు గుర్తు చేసుకుంటూ తీవ్ర సంతాపం తెలిపారు.