కోనసీమలో కలకలం: మాచవరంలో మళ్లీ లీకైన ఓఎన్జీసీ గ్యాస్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Dr. B.R. Ambedkar Konaseema
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని పంట పొలాల్లో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ నుంచి మళ్లీ గ్యాస్ లీకైందని స్థానికులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో లీకేజీ జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.