భారత వాయుసేనకు దేశీయంగా తయారైన సాట్ సావ్ క్షిపణులు

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

భారత వాయుసేన అమ్ములపొదిలోకి అత్యాధునిక స్వదేశీ సాట్ సావ్ క్షిపణులు చేరనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికోసం భారత్ డైనమిక్స్ తో రూ. 810.79 కోట్ల ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు. వంద కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ గైడెడ్ బాంబులు శత్రు దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో కీలకం కానున్నాయి. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ ఆయుధాలు దేశీయ రక్షణ రంగానికి ఎంతో మేలు చేకూరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.