గుడిపాల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మమతశ్రీ భారీ విజయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ ఎన్నికల్లో గుడిపాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మమతశ్రీ ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. నామినేషన్ సమయంలో రూ. 172.27 కోట్ల ఆస్తులు ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె, సమీప ప్రత్యర్థిపై 4,816 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన సత్తా చాటుకున్న మమతశ్రీ విజయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.