రామాయణ చిత్రంలో రావణ జటాయు పోరాటానికి ఆరున్నరేళ్ల సమయం
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
రామాయణ చిత్రంలో రావణుడు మరియు జటాయువు మధ్య పోరాట దృశ్యాన్ని తెరకెక్కించడానికి ఆరున్నరేళ్ల సమయం పట్టిందని దర్శకుడు నితేష్ తివారీ స్పష్టం చేశారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం వేలాది మంది కళాకారులు శ్రమించారని ఆయన తెలిపారు. రావణుడి పుష్పక విమాన రూపకల్పనకే దాదాపు రెండేళ్లు పట్టిందని, సుమారు యాభై డిజైన్లను పరిశీలించి తుదిరూపు ఇచ్చినట్లు శ్రేయస్ మీడియా ఇంటర్వ్యూలో నితేష్ తివారీ వెల్లడించారు.