భూగోళంపై 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రమాదం: ఐరాస హెచ్చరిక

రిపోర్టర్: విజయ్ స్థలం: World

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటే ప్రమాదం ఉందని ఐరాస పర్యావరణ కార్యక్రమం (UNEP) హెచ్చరించింది. ఈ పరిమితి దాటితే హిమనీనదాలు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి మార్పులు శాశ్వతంగా మారిపోతాయని యూఎన్‌ఈపీ ఇండియా హెడ్ బాలకృష్ణ పిసుపతి స్పష్టం చేశారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను వెంటనే తగ్గించకపోతే పర్యావరణ వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.