హవాయి దీవుల్ లో దాతృత్వ ప్రయాణం: వంద మిలియన్ల డాలర్లు విరాళమిచ్చిన జుకర్ బర్గ్ దంపతులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హవాయి
హవాయిలోని కౌఐ దీవిలో దాతృత్వ కార్యక్రమాలు ప్రారంభించి దశాబ్దం పూర్తయినట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సతీమణి ప్రిసిల్లా చాన్ వెల్లడించారు. ఈ కాలంలో వందకు పైగా స్థానిక సంస్థలకు సుమారు వంద మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు సమకూర్చినట్లు ఆమె తెలిపారు. స్థానిక ప్రజలు, నాయకుల అభిప్రాయాలను గౌరవిస్తూ ఆరోగ్యం, విద్య, గృహ వసతి మరియు సంస్కృతి పరిరక్షణ రంగాలకు ఈ నిధులను కేటాయించినట్లు చాన్ పేర్కొన్నారు.