వర్ధన్నపేట పట్టణంలో ఘనంగా జరిగిన పండుగ సాయన్న జయంతి వేడుకలు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద పండుగ సాయన్న జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పిట్టల భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.