పుంగనూరులో తెలుగు తమ్ముడిపై దాడి: పెద్దిరెడ్డి దమనకాండపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపాటు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తూర్పు గోదావరి

పుంగనూరులో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తపై ప్రత్యర్థులు దాడులకు తెగబడటం అత్యంత దుర్మార్గమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటూ నిరంతరం దాడులకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని స్పష్టం చేస్తూ, అరాచక రాజకీయాలను కట్టడి చేయడంలో అధికార వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు.