నక్కపల్లిలో బయోసిమిలర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆహ్వానం

రిపోర్టర్: శివ స్థలం: అహ్మదాబాద్

ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ గ్లోబల్ ప్రెసిడెంట్ దీపక్ గోండాలియాతో అహ్మదాబాద్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. నక్కపల్లి క్లస్టర్లో బయోసిమిలర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన సంస్థను ఆహ్వానించారు. బల్క్ డ్రగ్ పార్క్లో ఫెర్మెంటేషన్ ఆధారిత సామర్థ్యాన్ని అన్వేషించాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని దీపక్ గోండాలియా స్పష్టం చేసినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు.