ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అమరావతి

చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై లెక్కలేదని, 2019 ఎన్నికల ముందు నంద్యాల ఉప ఎన్నికలో పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక ఘోరాలకు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి అరాచకాలు తాత్కాలికమేనని, అవి ఎప్పటికీ శాశ్వతంగా నిలబడవని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ అధికారంలోకి రావాలని చూస్తున్న వారికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని మాజీ సీఎం హెచ్చరించారు.