ఉద్యోగం కోల్పోయి గిగ్ వర్కర్గా మారిన ఐఐటీ పూర్వ విద్యార్థి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Dallas

అమెరికాలో ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గౌతమ్ దేవ్ వెల్లడించారు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి అయిన ఆయన, డల్లాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వయసు పైబడటం మరియు సుదీర్ఘ విరామం వల్ల కొత్త ఉద్యోగం దొరకలేదని, ప్రస్తుతం జీవనం కోసం ఉబర్, డోర్డాష్ వంటి సంస్థల్లో గిగ్ వర్కర్గా పనిచేస్తూ పొదుపు మొత్తాలను కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.