ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎక్స్ఐవీ దరఖాస్తు గడువు పొడవు

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఐబీపీఎస్ సీఆర్పీ ఆర్ఆర్బీ ఎక్స్ఐవీ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 27వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రకటించింది. గతంలో ఉన్న గడువు సెప్టెంబర్ 21తో ముగియనుండగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించి ఫీజు చెల్లించాలని సూచించారు.