మర్రిపాడులో చెరువు కబ్జా.. చోద్యం చూస్తున్న అధికారులు

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలంలోని పోలీరెడ్డిపల్లి చెరువు శిఖం భూమిని కొందరు బడాబాబులు కబ్జా చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల చెరువు భూమిని జేసీబీలతో చదును చేస్తూ, చెరువు కట్టను సైతం తొలగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చెరువు శిఖం భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కబ్జాల వల్ల భవిష్యత్తులో సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.